Ikshvaku Dynasty in Telugu-ఇక్ష్వాకులు చరిత్ర
*పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు సూర్యవంశం (రామాయణ కాలం) కు చెందినవారని పురాణాలు తెలుపుతాయి.
*కానీ చారిత్రకంగా ఇది దక్షిణ భారతదేశంలోని స్వతంత్ర రాజవంశం.
*సూర్యాపేట జిల్లాలో పురాతన నాణేలు బయటపడ్డాయి. నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీగా పురాతన నాణేలు బయటపడ్డాయి.అందులో 3,730 సీసపు నాణేలు వాటికి సమీపంలోనే గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతులు, అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం వంటివీ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆ సీసపు నాణేలు ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తించారు .. ఒకేచోట ఇంత పెద్ద మొత్తంలో నాణేలు దొరకడం దేశంలోనే మొదటిసారి అంటున్నారు.
*ఇక్షావకుల కాలంలో చేతి వృత్తుల సంగనాయకుడిని “ఉలిప్రముఖ” అంటారు.
*ఇక్షావకుల కాలంలో పన్ను విధించే వారు అని తెలిపే శాసనం -“విష్వట్టి శాసనం “
*మిఠాయి వ్యాపారం చేసే శ్రేణిని “పూసిన శ్రేణి “అంటారు.
*తమలపాకులు వ్యాపారం చేసే శ్రేణిని “ఎర్నిక “శ్రేణి అంటారు
*రాజధాని -విజయపురి
*మతం -వైష్ణవం ,బౌద్ధమతం
రాజభాష -ప్రాకృతం
శిల్పకళా -ఆకుపచ్చని రాతిపై శిల్పాలు .మాంధాత శిల్పం(జగ్గయ్యపేట )
ఇక్ష్వాకు వంశం – ముఖ్యాంశాలు (Ikshvaku Dynasty Key Points)
ఇక్ష్వాకు రాజులు – పాలన, కృషి, బిరుదులు
రాజు పేరు | పాలన కాలం | ముఖ్య కృషి / విజయాలు | బిరుదులు |
---|---|---|---|
వసిష్ఠ పుత్ర శాంతమూలుడు (స్థాపకుడు) |
క్రీ.శ. 225-245 | – ఇక్ష్వాకు వంశ స్థాపన
-గొప్ప యుద్ధ వీరుడు –ఇతను వేయించిన శాసనాలు రెంటాల ,దాచేపల్లి ,కేశనపల్లి -ఇతను అశ్వమేధ ,వాజపేయి యాగాలు నిర్వహించాడు -నాగరాజును కొండ దగ్గర ఇతని అశ్వమేధ యాగ “వేదిక దొరికింది |
మహాధనాధిపతి ,శతసహస్రహలక |
వీర పురుషదత్తుడు | క్రీ.శ. 245-265 | – ఇతని కాలం లో బౌద్ధ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది
–గొప్పవాడు వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేసాడు ,ఇతని కాలంలోనే మేనత్త కుమార్తెలని పెళ్లి చేసొవడం మొదలు అయింది. ఇతని కాలంలో “శ్రీ పర్వత విశ్వ విద్యాలయం స్థాపించబడింది . ఇది భారత దేశంలోనే అత్యంత ప్రాచీన విద్యాలయం శాసనాలు -జగ్గయ్యపేట శాసనం , నాగార్జునకొండ శాసనం ,అమరావతి శాసనం ,ఉప్పుకొందురు శాసనం |
దక్షిణాది అశోకుడు |
ఎహువల శాంతమూలుడు | క్రీ.శ. 265-290 | –
– ఎక్కువ కాలం పనిచేసాడు -ఇతని కాలంలోనే సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదయం మొదలు అయింది -నాగార్జున కొండ వద్ద సంస్కృత శాసనం వేయించాడు ఇది దక్షిణ భారత దేశంలో మొదటి సంస్కృత శాసనం. -దక్షిణ భారతదేశంలో మొదట హిందూ దేవాలయాలు నిర్మిచిన రాజు . -ఇతని సోదరి నాగార్జున కొండా మీద కొండసరి బౌద్ధ విహారాన్ని నిర్మించింది -ఇతను వేయించిన శాసనాలు “గుమ్మడిదురు “అనే గ్రామంలో లభించాయి ఇతను నిర్మించిన ఆలయాలు 1.కార్తికేయ ఆలయం 2.నందికేశరా ఆలయం,3.నవగ్రహ ఆలయం ,4.హారతి దేవాలయం |
|
రుద్రపురుషదత్తుడు | క్రీ.శ. 290-300 | – ఇక్ష్వాకు పతనాన్ని ఆపడానికి ప్రయత్నాలు – చివరి పాలకుడు ఇతని మీద దాడి చేసిన పల్లవరాజు -సింహవర్మ సింహవర్మ వేయించిన శాసనం -మంచికట్ల శాసనం |
Ok 👍 good information tqq